
తిరుపతి: తిరుపతి(Tirupati)లోని గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్క్ దుకాణంలో మంటలు చెలరేగాయి. రద్దీ ప్రాంతంలో, ఇండ్ల మధ్య ఉన్న దుకాణంలో మంటలు రావడంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. గోవిందరాజస్వామి గుడి రథ మండపం వద్దకు మంటలు వ్యాపించాయి. మూడంతస్థుల భవనంలో ఎగసిపడుతున్న మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇరుకైన ప్రాంతంలో ఘటన జరగడంతో దూరం నుంచే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఫోటో ఫ్రేమ్ దుకాణంలో దాదాపు 10 కోట్ల విలువైన ఫోటో ఫ్రేమ్లు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు మరిన్ని షాపులకు వ్యాపిస్తున్నాయి. మహారథానికి కూడా నిప్పు అంటుకుంది. గోవిందరాజుకు చెందిన మహారథం తగలబడినట్లు స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాదంతో అలర్ట్ అయిన భక్తులు పరుగులు తీశారు. ఇటీవలే ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పూర్తయిన విషయం తెలిసిందే.
Tirupati: A huge fire accident took place near Govindaraja Swamy temple in Tirupati today. A fire broke out in Lavanya’s photo frame work shop. In a crowded area, the situation got out of control after a fire broke out in a shop located between houses. The fire spread to the Ratha Mandapam of Govindarajaswamy temple. Firefighters are trying to douse the flames in the three-storey building. The people of the surrounding area are panicking after seeing the huge fire. As the incident took place in a narrow area, the firemen are working hard to extinguish the fire from a distance.
It seems that the photo frame shop has photo frames worth around 10 crores. The fire is spreading to more shops. Maharatha also caught fire. Locals say that Maharatha belonging to Govinda Raju was burnt. Alerted by the fire, the devotees ran. It is known that the gold plating of the Vimana Gopuram of the temple has been completed recently.